: అతి సమీపంలోని బాంబులనూ పసిగట్టే పరికరం
20 మీటర్ల దూరంలో ఉన్న బాంబులను కచ్చితంగా పసిగట్టగల పరికరాన్ని యూరోప్ పరిశోధకులు తయారు చేశారు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సాయంతో ఆప్టిక్స్ అనే సంస్థ పరిశోధకులు ఈ నూతన పరికరాన్ని ఆవిష్కరించారు. దీనిని వాహనాలలో ఏర్పాటు చేసుకుంటే మారుమూల ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో బాంబులు పేల్చడం ద్వారానే ముఖ్యనేతలు సహా 28 మందిని మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తే, అలాంటి భారీ ప్రమాదాల ముప్పును తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీనిని దానంతట అదే వాహనంలా కదిలి వెళ్లి బాంబును గుర్తించేలా రూపొందించడంలో పరిశోధకులు నిమగ్నమయ్యారు.