: పవన్ కల్యాణ్ టీడీపీలో చేరడం ఒట్టిదే: రామచంద్రయ్య
సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన ఈ రోజు తిరుమల వచ్చిన సందర్భంగా మీడియాతో చెప్పారు. తిరుచానూరు గ్రామాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రకటించే విషయంలో స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ పై స్పష్టత వచ్చాక అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, స్థానికులను గ్రామం నుంచి తొలగించబోమని చెప్పారు.