: ఐపీఎల్ క్రికెట్ కు సచిన్ వీడ్కోలు
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగు మెరుపుల్ని ఇక మనం ఐపీఎల్ మ్యాచుల్లో చూడలేం. జట్టుకి కొండంత అండగా నిలిచే ఆ మేరునగధీరుడు ఇక ఈ మ్యాచుల్లో కనపడడు. ఎందుకంటే, ఐపీఎల్ కి సచిన్ గుడ్ బై చెప్పేశాడు. నిన్న రాత్రి ఐపీఎల్ ఫైనల్స్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ని ముంబయ్ ఇండియన్స్ చిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకున్న పిదప, సచిన్ తన రిటైర్మెంటుని ప్రకటించాడు. ఐపీఎల్ కు ఇదే తన చివరి సీజన్ అని వినమ్రంగా ప్రకటించి సెలవు తీసుకున్నాడు. భార్య అంజలి, కూతురు సారా లతో కలిసి మైదానం అంతా కలియతిరుగుతూ అందరికీ వీడ్కోలు పలికాడు మాస్టర్ బ్లాస్టర్.