: డైట్‌ సోడా కొకైన్‌ అంత ప్రమాదమట!


డైట్‌ సోడా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డైట్‌ సోడాలో ఉండే సిట్రిక్‌ ఆసిడ్‌, పాస్పారిక్‌ ఆసిడ్లు మన దంతాలపై పనిచేసి వాటిని పాడుచేస్తాయట. ఇది ఎంతలా అంటే కొకైన్‌కి అలవాటుపడిన వ్యక్తికి దంతాలు ఎంతలా పాడవుతాయో అంతగా డైట్‌ సోడా పాడుచేస్తుందని చెబుతున్నారు.

ఫిలడెల్ఫియాలోని టెంపుల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డెంటిస్ట్రీకి చెందిన డాక్టర్‌ మహమూద్‌ బాషానీ చేపట్టిన ఒక అధ్యయనంలో 30 ఏళ్ల వయసున్న డైట్‌ సోడా రోజూ తీసుకునే మహిళలను, అలాగే 51 సంవత్సరాల వయసున్న కొకైన్‌ తీసుకునేవారిని పరిశీలించారు. ఈ పరిశీలనలో వీరిద్దరిలో దంతాలు ఒకేవిధంగా పాడై ఉన్నట్టు గమనించారు. కొకైన్‌ తీసుకునేవారిలో దంతాలు ఎంతలా పాడవుతాయో డైట్‌ సోడా తీసుకునే వారిలో కూడా అంతగానే దంతాలు పాడై ఉన్నట్టు ఆయన గమనించారు. సోడా తాగేవారు దాన్ని కొద్దిసేపు నోటిలో ఉంచుకుంటారు, ఈ సమయంలోనే దానిలోని ఆసిడ్లు పళ్లపై పనిచేసి వాటిని పాడుచేస్తాయని ఆయన చెబుతున్నారు. అందుకే డైట్‌ సోడాకు దూరంగా ఉండమని మహమూద్‌ హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News