: అప్రమత్తంగా ఉన్నాం: డీజీపీ దినేష్ రెడ్డి
ఛత్తీస్ గఢ్ ఘటన నేపధ్యంలో ఆంధ్రాఒడిషా బోర్డర్ లో అప్రమత్తంగా ఉన్నామని డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛత్తీస్ గఢ్ ఘటనలో రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు పాల్గొన్నారన్న దానిపై సమాచారం లేదన్నారు. రాష్ట్రంలోని నేతలకు ప్రస్తుతం భద్రత పెంచాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. అన్నిరకాల భద్రతా వ్యవస్థలతో ఏ ముప్పునైనా అడ్డుకునేందుకు రెడీగా ఉన్నామని దినేష్ రెడ్డి తెలిపారు.