: బీజేపీ జైల్ భరో వాయిదా


యూపీఏ ప్రభుత్వ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ చేపడతామన్న జైల్ భరో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై నిరసనలు, ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి చేయాలని భావించిన బీజేపీ చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడి నేపధ్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించింది. త్వరలోనే జైల్ భరో కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది చెబుతామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News