: వైఎస్ హయాంలోనే అగస్టా అక్రమాలు: రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మూలాలు రాష్ట్రంలోనే ఉన్నాయని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
15 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ నాడు వైఎస్ ప్రయాణానికి ఉపయోగపడలేదని.. దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బేగంపేట విమానాశ్రయంలో కాలిపోయిన హెలికాప్టర్ వైఎస్ హయాంలో కొనుగోలు చేసిందేనని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.