: కిడ్నాప్ గ్యాంగు నడుపుతున్న పోలీసులు!
జల్సాలకు, డబ్బు సంపాదనకు కిడ్నాప్ లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అనంతపురంలో అరెస్టు చేసారు. పధకం ప్రకారం కిడ్నాప్ కు పాల్పడి, డబ్బు వసూళ్లకు పాల్పడే వీరిపై పలు కేసులున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉండడం విశేషం. కిడ్నాప్ గ్యాంగ్ ను నడిపించేది వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి 3 లక్షల 75 వేల రూపాయల నగదు, ఒక ఇన్నోవా వాహనం, ఆరు తూటాలు, రెండు బైకులు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు వీరిని విచారిస్తున్నారు.