: ఇక రోడ్లు-భవనాలు, హోం మంత్రి కూడా సీఎమ్మే
అవినీతి ఆరోపణలతో మంత్రులు ధర్మాన, సబితల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో ఆ రెండు శాఖలు ముఖ్యమంత్రి పరిధి లోకి తెస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖను ధర్మాన ప్రసాదరావు నిర్వర్తించగా, హోం శాఖను సబితా ఇంద్రారెడ్డి నిర్వహించారు. జగన్ అక్రమాస్తుల కేసులో అక్రమ భూకేటాంయింపులు చేసారని వీరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరి రాజీనామాలతో ఆ రెండు శాఖలు ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చాయి.