: బాబ్బాబు.. పెళ్లి చేసుకుంటా బెయిలివ్వండి!


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు అంకిత్ చవాన్ తో పాటూ ముగ్గురు బుకీలకు కోర్టు జూన్ 4 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన అంకిత్, తాను ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దానితో పాటూ పోలీసులకు విలువైన సమాచారాన్ని కూడా అందించాడు. దీంతో శిక్ష ఖరారువుతుందనుకున్న అంకిత్ జూన్ 2 న తన పెళ్లి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో అంకిత్ బెయిల్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. మరో వైపు శ్రీశాంత్ కూడా తనకు బెయిలు మంజూరు చేయాలంటూ పిటీషన్ వేశాడు. దీంతో అతని బెయిల్ విచారణను కూడా 28 వ తేదీకి కోర్టు వాయిదావేసింది.

  • Loading...

More Telugu News