: ఎన్నికలే లక్ష్యమైతే ఉద్యమమెందుకు చేశారు?: మధుయాష్కీ


2014 ఎన్నికలే లక్ష్యమైతే, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు ఎందుకు చేసిందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడనే కేసీఆర్ ను పెద్దన్నలా గౌరవించామని తెలిపారు. టీఆర్ఎస్ కి ఎంపీలు వెళ్లకుండా అడ్డుకుంటున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో వంద సీట్లు గెలిస్తే తెలంగాణ వస్తుందన్నది పొరపాటన్నారు. కేవీపీ, కేసీఆర్ సంబంధాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై ఆయనకు కోపమొస్తోందని అన్నారు. ఎన్నికలే లక్ష్యమంటూ తెలంగాణకి ద్రోహం చేయడం తగదన్నారు. ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్నవారిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News