: చేప ప్రసాదంలో ఔషధగుణాలున్నాయా?


చేపప్రసాదంలో అస్తమా, శ్వాస కోశ ఇబ్బందులను తగ్గించే ఔషధ గుణాలు ఏమాత్రం లేవని జేవీవీ రాష్ట్రకార్యదర్శి రమేష్ తెలిపారు. గతంలో ఈ విషయాన్ని బత్తిన సోదరులే హైకోర్టు ముందు అంగీకరించారని గుర్తు చేసారు. చేప మందు రూపంలో వారు పంపిణీ చేస్తున్నది ఆహార పదార్ధం మాత్రమేనని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారని తెలిపారు. దాన్ని మరిచిపోయి ప్రజలకు, ప్రచారసాధనాలకు మాత్రం ఆయుర్వేద మూలికా పదార్థంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా చేప ప్రసాదంలో ఉబ్బసాన్ని తగ్గించే గుణం ఉంటే ప్రభుత్వమే ఆయుష్ విభాగం ద్వారా రాష్ట్రప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బత్తిన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ప్రజలకు నిజానిజాలను చెబితే తాము ప్రైవేటు ఔషధ కంపెనీల నుంచి డబ్బులు దండుకున్నామని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News