: నన్ను ఒక్కడినే కాల్చండి!:మావోయిస్టులతో మహేంద్రకర్మ
ఛత్తీస్ గఢ్ లోని మావోల దాడి ఘటనలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి. ఒక్కసారిగా మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులకు 'నన్ను ఒక్కడినే చంపాలని' మహేంద్రకర్మ ధైర్యంగా చెప్పారట. సల్వాజుడుం వ్యవస్థాపక నేత మహేంద్రకర్మ లక్ష్యంగా జరిగిన దాడిలో మావోలు చుట్టుముట్టి కాన్వాయ్ డ్రైవర్ను కాల్చడంతో, ప్రమాదాన్ని పసిగట్టిన మహేంద్రకర్మ కారు దిగి కార్యకర్తలను, ఇతరులను ఏమీ చేయవద్దంటూ వారిముందుకెళ్లి, నన్ను ఒక్కడ్నే కాల్చాలంటూ ముందుకొచ్చారని, దీంతో అతడి చేతులు కట్టి వేసి, అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనా స్థలంనుంచి పరుగెడుతున్న పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ ను, ఆయన కుమారుడ్ని పట్టుకుని చంపేశారని తెలిపారు.