: పంజాబ్ ముఖ్యమంత్రిగా నవాజ్ షరీఫ్ తమ్ముడు!


పంజాబ్ ముఖ్యమంత్రి పాక్ ప్రధాని తమ్ముడేంటి? అని అశ్చర్యపోతున్నారా... మరీ అంత ఆశ్చర్యపోకండి. అతను పంజాబ్ ముఖ్యమంత్రే కానీ, భారత్ లోని పంజాబ్ కు కాదండోయ్. పాకిస్థాన్ ప్రావిన్సులోని పంజబ్ కు ముఖ్యమంత్రిగా షహబాజ్ షరీఫ్ ను పీఎంఎన్ఎల్-ఎన్ పార్టీ ఎంపిక చేసింది. దీంతో ఆయన రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. జూన్ 1 న పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. కాగా, 61 ఏళ్ల షహబాజ్ షరీఫ్ స్వయానా నవాజ్ షరీఫ్ కు తమ్ముడు.

  • Loading...

More Telugu News