: ఛత్తీస్ గఢ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను పరిహారంగా ప్రధాని సహాయనిధి నుంచి అందజేయనున్నామని ప్రధాని మన్మొహన్ సింగ్ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 వేలు అందజేయనున్నట్టు తెలిపారు. రాయ్ పూర్ లో దాడి బాధితుల సంతాప సభలో ప్రధాని మన్మొహన్ సింగ్, సోనియా గాంథీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు ఉగ్రవాదంతో పోరాడడంలో మరింత చిత్తశుద్ధి, పట్టుదల అవసరం అన్నారు. వారి ప్రాణాలు వృధాగా పోరాదని, తీవ్రవాదం, హింసలతో జరిపే పోరాటానికి ఈ సంఘటన స్పూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతల సాహసాన్ని ప్రశంసిస్తున్నానని సోనియా తెలిపారు.

  • Loading...

More Telugu News