: 56 సెకెన్లలో 36 అవయవాల పరీక్ష


కేవలం నిమిషం వ్యవధిలో శరీర అవయవాల పనితీరు పరీక్షలు పూర్తి చేస్తే కాలం కలిసిరావడమే కాకుండా రోగులకు బోలెడు సహాయం చేసినట్టే. సరిగ్గా అలాగే, 56 సెకెన్లలోనే 36 శరీర అవయవాల పనితీరును పరీక్షించారు వైద్యులు. హైదరాబాద్ లోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ తిరుమలనగర్ లో గుండెపోటు మరణాలు అరికట్టడానికి నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా రెట్రో హెల్త్ కేర్ వైద్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులతో సంయుక్తంగా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. రెట్రో ఇండియా హెల్త్ కేర్ సంస్థ 'అవాయిడ్ హార్ట్ ఎటాక్' అనే నినాదంతో కేవలం 56 సెకెన్లలోనే 36 అవయవాలను పరీక్షించే ఏర్పాట్లు చేసింది. పరీక్షలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితి వివరించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది.

  • Loading...

More Telugu News