: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతోందా?
కాకినాడలో సముద్రం ఉప్పొంగిపోతోంది. కాకినాడ దగ్గర ఉప్పాడలో సముద్రుడు అకస్మాత్తుగా 20 మీటర్లు ముందుకి దూసుకొచ్చేసాడంటూ స్ధానికులు భయాందోళనలకు గురౌతున్నారు. ప్రతి అమావాస్య, పౌర్ణమికి ఆటుపోటుల సందర్భంగా ఉగ్రరూపం దాల్చే సముద్రం వాటితో సంబంధం లేకుండా పట్టపగలు ముందుకు వచ్చేయడంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. కెరటాలు రహదారులపై విరుచుకుపడుతుండడంతో కాకినాడ నుంచి ఉప్పాడ మార్గంలోని రాకపోకలకు తీవ్ర ఆటకం కలుగుతోంది. సముద్రం ఎన్నడూ లేనంతగా ముందుకు వచ్చేయడంతో మూఢవిశ్వాసాలవైపు మరలుతున్నారు స్థానికులు. దీంతో ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతోందని భూమి సముద్రంలో కలిసిపోతుందని వదంతులు ఊపిరిపోసుకుంటున్నాయి.