: నాకీ పెళ్లొద్దు బాబోయ్...!


మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు ఉడాయించాడు. దీంతో పెళ్లికుమార్తె తల్లిదండ్రులు లబోదిబోమంటూ హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో తమ కుమార్తెకు న్యాయం జరిపించండంటూ ఫిర్యాదు చేశారు. బోరబండ శివాజీనగర్ కు చెందిన కవితతో బాలానగర్ కు చెందిన నరేష్ కుమార్ తో వివాహం నిశ్చయమైంది. పెండ్లిపత్రికలు పంచుతానంటూ వెళ్లిన నరేష్ తిరిగి రాకపోవడంతో పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. పెళ్ళి ఇష్టం లేకనే నరేష్ పరారయ్యాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News