: మండే సూర్యుడి ధాటికి 92 మంది మృతి


ఉగ్రరూపం దాల్చిన భానుడు ఇప్పట్లో శాంతించేలా లేడు. భానుడి భగభగలకు గతమూడు రోజుల్లో ఎనిమిది వందల మందికి పైగా మృతి చెందారు. ఈ రోజు సగం పూర్తయ్యేసరికే వడదెబ్బ ధాటికి 92 మంది మరణించారు. ఉష్ణతాపానికి గురవ్వకుండా ఉండేందుకు ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఎండల ధాటికి రైతు కూలీ, వలస కూలీలు ఎక్కువగా మృతి చెందుతుండడంపై మనవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యాహ్నానికి పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటిపోయాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే కానీ బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా తలకు, ముఖానికి టోపీ లేదా గుడ్డ వంటివి ఏవైనా రక్షణకు ధరించి వెళ్లాలని ఆరోగ్యకేంద్రాల అధికారులు సూచిస్తున్నారు .

  • Loading...

More Telugu News