: శుక్లా పరిస్థితి విషమం


మావోయిస్టుల దాడిలో గాయపడిన కేంద్ర మాజీ మంత్రి శుక్లా(84) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఉదయం ఆయనను మెరుగైన చికిత్స కోసం జగదల్ పూర్ నుంచి గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. శుక్లా ఊరిపితిత్తులు, కాలేయం, పొత్తి కడుపు భాగాల్లో బుల్లెట్ గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. దాడి అనంతరం తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలిపారు. అన్ని రకాల వైద్య సాయం అందిస్తున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News