: నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎనిమిదో సారి టైటిల్ సాధించేందుకు క్లే కోర్టు కింగ్ రఫేల్ నాదల్ సిద్దమౌతుండగా, అతనికి ఈసారి జోకర్ జంకోవిచ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. జంకోవిచ్ అంతర్జాతీయ సర్క్యూట్లలో నాదల్, ఫెదరర్ కు షాక్ ఇస్తున్నాడు. దీంతో నాదల్ అనుభవంతో బరిలో దిగుతుండగా దూకుడైన ఆటతీరుతో అతనికి సమాధానం చెప్పేందుకు జంకోవిచ్ కోర్టులో అడుగిడనున్నాడు. ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ హోరా హోరీ పోరుకు వేదిక కానుంది. క్లేకోర్టుల్లో సాగనున్న ఈ పోటీల్లో భారత్ నుంచి బరిలో దిగుతున్న ఒకే ఒక్క ఆటగాడు సోమ్ దేవ్ వర్మన్!