: బాధితులకు రమణ్ సింగ్, రాహుల్ పరామర్శ
మావోయిస్టుల కాల్పుల్లో గాయపడి జగదల్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేతలను ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రమణ్ సింగ్ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ ప్రకటించారు. ఇలాంటి దాడులకు భయపడబోమని మావోయిస్టులకు హెచ్చరిక జారీ చేశారు.