: విశాఖలో సినీనటుల క్రికెట్ మ్యాచ్
మరోసారి నటీనటులు క్రికెట్ మ్యాచ్ తో అభిమానులకు వినోదాన్ని పంచిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 9న విశాఖపట్నంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బాలికా విద్య, వృద్ధుల కోసం అందిస్తామని నటులు శ్రీకాంత్, తరుణ్ చెప్పారు. అలాగే అసోసియేషన్ కూడా రెండున్నర లక్షల రూపాయలు విరాళంగా ఇస్తుందని తెలిపారు.