: మధ్యవయసు మహిళల్లో మెమరీ తగ్గుతుంది
మహిళలకు మెనోపాజ్ దశలో ఆరోగ్య పరంగా పలు సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ దశలో వారిలో జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వారు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 44-62 సంవత్సరాల మధ్య వయసుకల మహిళలను తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు. వీరంతా కూడా మెనోపాజ్ దశకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారే. వీరందరికీ ఒక ప్రత్యేక ప్రశ్నావళిని అందించారు. ఈ ప్రశ్నావళిలో మెనోపాజ్ దశలో వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఇబ్బందులకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. ఈ పరీక్షలో ఎక్కువ మంది మహిళలు జ్ఞాపకశక్తికి సంబంధించిన విషయంలో వెనుకబడినట్టు తెలిసింది.