: అజీర్తితో క్యాన్సర్‌ ప్రమాదం!


మనలో చాలామందికి గుండెల్లో మంట అనిపిస్తుంటుంది. దీనికి కారణం అజీర్తి అని కొందరు చెబుతుంటారు. అయితే ఇలాంటి వారికి కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. పొగతాగకున్నా, మద్యపానం చేయకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులుండే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయని బ్రౌన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని గమనించారు. తరచూ గుండెల్లో మంట కలగడానికి, గొంతు, స్వరపేటిక క్యాన్సర్లతో సంబంధం ఉండే అవకాశం ఉందని వారంటున్నారు.

గుండెల్లో మంట కలుగుతున్న ఇబ్బంది సహజంగా ఛాతీ ఎముక వెనుక తెరలు తెరలుగా వస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో ఫైరోసిస్‌ లేదా ఆమ్ల అజీర్తిగా పేర్కొంటారు. గతంలో జీర్ణరసాలు వెనక్కి తన్నడం, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లపై నిర్వహించిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న స్కాట్‌ ఎం లాంగెవిన్‌ అంటున్నారు. తాము ఈ విషయంపై విస్తృత స్థాయిలో అధ్యయనం జరిపామని ఆయన చెబుతున్నారు. కాబట్టి గుండెల్లో మంట లాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది!

  • Loading...

More Telugu News