: 30 న ఢిల్లీలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రారంభం


తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ నడిబొడ్డున గోల్ మార్కెట్ లో 11 కోట్లతో నిర్మించిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఈ నెల 29 న అర్చకుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరుగనుంది. అదే రోజు ఉదయం 8 గంటలకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, 9 నుంచి 12 గంటల మధ్య శ్రీదేవి-భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, గురుడాళ్వార్ ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆలయ నిర్మాణదాత నిర్మల్ సేథియా సమక్షంలో ఆలయాన్ని ప్రారంభిస్తారు. తరువాత జూన్ 1 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News