: వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం: చంద్రబాబు


వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. పొత్తులు లేకుండా టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదని గుర్తు చేసారు. ఓయూ జేఏసీ నేత రాజారం యాదవ్ టీడీపీలో చేరిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు వేరని, ఉపఎన్నికల్లో విజయాలను గీటురాళ్ళుగా గుర్తించలేమని తెలిపారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని బాబు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యమాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News