: ఘనంగా నిఫ్ట్ కాన్వొకేషన్ డే
నిఫ్ట్ కాన్వొకేషన్ ఘనంగా జరిగింది. తాముడి జైన్ చేసిన దుస్తులతో ఫ్యాషన్ షోలో పాల్గొని విద్యార్థులు అతిథులను, ఆహూతులను అలరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలంటే ఓపిక, సహనం అవసరమని నిఫ్ట్ స్నాతకోత్సవానికి అతిథిగా హాజరైన మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు వస్త్రాలను తయారు చేసి అందుబాటులో ఉంచితే ఫ్యాషన్ రంగంలో రాణించవచ్చని సూచించారు. ముఖ్యఅతిథి హైదరాబాద్ యూనివర్సిటీ ఉపకులపతి రామస్వామి మాట్లాడుతూ సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్వయించుకుంటూ ఉంటే భవిష్యత్తు బంగారంలా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు బంగారు పతకాలు, ధ్రువపత్రాలను అందజేసారు.