: నోట్లో మొబైల్ పేలి తీవ్ర గాయాలు
నోట్లో మొబైల్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మధ్యప్రదేశ్ సియోనీ జిల్లాలో చోటుచేసుకుంది. గురుద్వారా గ్రామంలో మితిలేష్(22) మొబైల్ టార్చ్ వెలిగించి నోట్లో మొబైల్ పెట్టుకుని టార్చ్ వెలుతురులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మొబైల్ పేలింది. దీంతో మితిలేష్ ముఖం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన అతడ్ని జిల్లా కేంద్రానికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు.