: జూన్ మొదటివారంలో 'నేనేం చిన్నపిల్లనా' సినిమా పాటలు


'నేనేం చిన్నపిల్లనా?' సినిమా 60 శాతం నిర్మాణం పూర్తి చేసుకుందని నిర్మాత డి రామానాయుడు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాకు 'సొంతఊరు', 'గంగపుత్రులు' సినిమాల దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారన్నారు. విశాఖపట్టణం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పాటల చిత్రీకరణకు విదేశాలకు పయనమవనుందని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, ఆగస్టులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. తన పంజాబీ సినిమా 'సింగ్ ఈజ్ కౌర్' సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నామని, 'నేనేం చిన్నపిల్లనా' సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తామని రామానాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News