: రాష్ట్రంలో తెలుగుదేశం బలంగానే ఉంది: దేవేందర్ గౌడ్
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంకు బలం ఉందని ఆయన అన్నారు. అసలు అలాంటి అవసరం కూడా వస్తుందని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల అండతో అన్ని ప్రాంతాల్లో ముందుకు వెళ్తామని దేవేందర్ గౌడ్ వెల్లడించారు. సహకార సంఘాల ఎన్నికలలో టీఆర్ఎస్ తో పొత్తుకు టీడీపీ అనుకూలమని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి ప్రకటించిన నేపథ్యంలో, దేవేందర్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.