: విశాఖ జూపార్క్ కు మరిన్ని జంతువులు
చల్లని సాయంత్రం... రంగుల హరివిల్లును తలపించే సీతాకోక చిలుకలు మన ముంగిట పూదోటలమీద దాడి చేస్తూ విహరిస్తుంటే పరవశించని హృదయం ఉంటుందా... చిన్నారులైతే ఆ అందానికి ముగ్థులై వాటిని సొంతం చేసుకునేందుకు పరుగులు పెడతారు. వసంత రుతువులో దక్కే ఈ సుందరదృశ్యం అందరికీ అందించేందుకు విశాఖ జూ ముస్తాబైంది. ఇందిరా ప్రియదర్శిని జూపార్క్ లో సీతాకోకచిలుకల పార్కును ప్రారంభించారు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు. ఏడాదిపాటు కష్టపడి ఈ పార్కును తీర్చిదిద్దినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మలేషియా నుంచి జిరాఫీని తీసుకురానున్నామని కూడా ఆయన చెప్పారు. 'జూ' ను మరింత అభివృద్ధి చేసేందుకు దత్తత కార్యక్రమం కూడా ప్రారంభించామన్నారు. రెండు చిరుతలు, చింపాంజీలను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.