: అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు సిద్దం: చీఫ్ విప్ గండ్ర
రానున్న శాసనసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ, సంక్షేమపథకాలను వైఎస్ హయాం కంటే మెరుగ్గా అమలు చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ వీడుతారని తాము అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అధిష్ఠానం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు.