: తెలంగాణ మేమిస్తాం: బీజేపీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి తెలిపారు. నరేంద్రమోడీ అధ్యక్షతన 2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పటు చేయగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ ఎప్పటికైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమయ్యే పార్టీయేనన్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా 50 వేల కోట్ల అవినీతి జరిగిందని, బీసీసీఐ అధ్యక్షపదవికి శ్రీనివాసన్ తక్షణం రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు. వాతావరణ శాఖ ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడడంలో విఫలమైందని విమర్శించారు. అడవులను పరిరక్షించుకుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.