: రాజీనామా చేసేది లేదు: శ్రీనివాసన్
స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలతో రాజీనామా చేయాలంటూ ఒత్తిడి ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పందించారు. తానే తప్పూ చేయలేదని, రాజీనామా చేస్తే నేను తప్పు చేసానన్న విషయాన్ని ఒప్పుకున్నట్టవుతుందని అందుకే రాజీనామా చేసేది లేదని తేల్చేసారు. కొంత మంది తనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, అయినా తానేంచేయాలో తనకు తెలుసని స్పష్టం చేసారు. బీసీసీఐ కఠిన నిబంధనలు అనుసరిస్తుందని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. గురునాథ్ విచారణపై వివరణ కోరగా బీసీసీఐ అన్నింటినీ చూసుకుంటుందని, విచారణ కోసం పోలీసులను సమాచారం అడిగామని, బీసీసీఐ అవినీతిని ఉపేక్షించదని తెలిపారు.