: 'ముంబయి' హీరో డ్వేన్ స్మిత్ కు జరిమానా
ముంబయి ఇండియన్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన కరీబియన్ మెరుపువీరుడు డ్వేన్ స్మిత్ జరిమానాకు గురయ్యాడు. నిన్న కోల్ కతాలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబయి.. రాజస్థాన్ పై నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ పోరులో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ వికెట్ల మధ్య పరిగెత్తే క్రమంలో రాజస్థాన్ బౌలర్ జేమ్స్ ఫాక్ నర్ ను ఉద్ధేశపూర్వకంగా ఢీకొట్టాడని మ్యాచ్ రిఫరీ తేల్చాడు. ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా భావిస్తూ స్మిత్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. స్మిత్ నిన్నటి మ్యాచ్ లో 44 బంతుల్లో 62 పరుగులు చేసి ముంబయి జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చాడు.