: సమరభేరి మోగిస్తోన్న చంద్రబాబు


తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందంటోన్న అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులెదురైనా కార్యకర్తలు అండగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారని బాబు సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు సన్నాహాలపై నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ, రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తూ, మంత్రులు జైలుకి పోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు.

తమ హయాంలో అవినీతి రహిత పాలన అందించామని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతిపరులు భయపడేవారని అన్నారు. సామాజిక న్యాయం, మహిళలకు భద్రత కల్పించామని చెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ భ్రష్టు పట్టిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందంటూ, భవిష్యత్తులో తృతీయకూటమిదే రాజ్యమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని పేర్కొన్న బాబు.. ఈ దిశగా మహానాడు సభకు ప్రత్యేక ప్రాధాన్యముందని చెప్పారు.

  • Loading...

More Telugu News