: బాబు ధోరణి నచ్చడం లేదు: బొడ్డు భాస్కర రామారావు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిశగా అడుగులేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు.. జగన్ తో భేటీపై వివరణ ఇచ్చారు. బొడ్డు ఈ రోజు చంచల్ గూడ జైల్లో జగన్ ను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వంటి కీలక అంశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి తనకు నచ్చలేదని బొడ్డు వ్యాఖ్యానించారు. టీడీపీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తావులేదని విమర్శించారు. కాగా, బొడ్డు వెంట జగన్ ను కలిసిన వారిలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News