: ఏంజెలినా కేన్సర్ విజయంతో మహిళల్లో పెరుగుతున్న ఆసక్తి


హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ బ్రెస్ట్ కేన్సర్ ను జయించిందంటూ వచ్చిన వార్త అదే కేన్సర్ తో బాధపడుతున్న ఎంతోమంది మహిళల్లో ఆసక్తిని నింపింది. ఏంజెలినా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య పరీక్షలలో తేలడంతో ఆమె బ్రెస్ట్ ను తొలగించే మాస్టెక్టమీ చికిత్స తీసుకున్నారు. ఇందులో భాగంగా బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం ఉన్న ఒకటి లేదా రెండు వక్షోజాల కణజాలాన్ని వైద్యులు తొలగిస్తారు. దీంతో కేన్సర్ రాకుండా, ఒకవేళ వస్తే ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉంటుంది.

ఏంజెలినా గురించి వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో బెంగళూరు నగరంలో కేన్సర్ నిపుణుల వద్దకు పదుల సంఖ్యలో వివరాల కోసం వస్తున్నారట. ఏంజెలినా జోలీలా తాము కూడా మాస్టెక్టమీ చేయించుకోవచ్చా? అని అడుగుతున్నారట. మొత్తానికి ఏంజెలినా తాను కేన్సర్ పై విజయం సాధించడమే కాకుండా మరింత మంది విజయం సాధించడానికి స్పూర్తిగా నిలిచింది.

  • Loading...

More Telugu News