: పది నిమిషాల్లో రొమ్ము క్యాన్సర్ గుర్తించొచ్చు!
రొమ్ము క్యాన్సర్‌ను కనుగొనేందుకు పలు రకాలైన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు ఖర్చు, సమయం కూడా ఎక్కువే అవుతుంది. అయితే పి-స్కాన్ అనే పరికరంతో పది నిముషాల్లో ఇట్టే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు పి-స్కాన్ అనే పరికరంతో మూత్రంలో ఉండే క్యాన్సర్ కారక బయోమార్కర్లను గుర్తించారు. ఈ పరికరం ద్వారా కనిపించే క్యాన్సర్ కారక బయోమార్కర్ల సంఖ్య అసాధారణంగా ఉంటే క్యాన్సర్ వ్యాధికి దారితీసినట్టుగా వీరు నిర్ధారించారు. ఈ పరికరం ద్వారా కేవలం పది నిమిషాల్లోనే క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించవచ్చని ప్రొఫెసర్ ఇనాఫ్-మా చెబుతున్నారు.