: దాల్చినచెక్కతో మతిమరుపు దూరం!


మీరు మతిమరుపుతో బాధపడుతున్నారా...? అయితే రోజూ మీ ఆహారంలో కాస్త దాల్చిన చెక్కను చేర్చుకోండి, మతిమరుపును దూరం చేసుకోండి. అంతేకాదు మతిమరుపు వ్యాధి అల్జీమర్స్‌కు దాల్చిన చెక్క చక్కటి ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్స్‌ వ్యాధి కలవారిలో మతిమరుపుతోబాటు అన్నంపై ద్వేషం, మాటలు అర్ధంకాకపోవడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి దాల్చిన చెక్కని ఆహారంలో ఇచ్చినట్టయితే వారిలోని ఈ వ్యాధి నయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. భారతసంతతికి చెందిన రోష్నీ జార్జ్‌ కూడా పాల్గొన్న ఈ పరిశోధనలో దాల్చిన చెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్‌, ఎపికాటికిన్‌ అనే పదార్ధాలు మెదడు పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తాయని తేలింది. అలాగే అల్జీమర్స్‌కు కారణమయ్యే కణాల పనితీరును మెరుగు పరచడం ద్వారా ఈ వ్యాధి నయమవుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు.

  • Loading...

More Telugu News