: ఇంట్లో కుక్క ఉన్నదా...అయితే, బ్యాక్టీరియా కూడా ఉన్నట్టే!


మీ ఇంట్లో కుక్క ఉందా...? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పెంపుడు కుక్కలు ఉండే వారి ఇంటిలోనే అరుదైన బాక్టీరియా ఉంటున్నాయట. ఇలాంటి అరుదైన బ్యాక్టీరియాను సదరు పెంపుడు కుక్కలే మోసుకొని మన ఇంట్లోకి తెస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెంపుడు కుక్కలు లేనటువంటి వారి ఇండ్లలో కనిపించనటువంటి అరుదైన బ్యాక్టీరియా కుక్కలుండే వారి ఇండ్లలో ఉన్నాయని నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

పెంపుడు కుక్కలు ఉండే వారి ఇంట్లోని టివి స్క్రీన్‌, పిల్లోకేస్‌, కిచెన్‌ కౌంటర్‌, ప్రిజ్‌, టాయిలెట్‌ సీట్‌, కూరలు తరిగే కట్టింగ్‌ బోర్డ్‌, తలుపుల హ్యాండిల్‌ పైన ఇలాంటి అరుదైన బ్యాక్టీరియా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కుక్కలను పెంచుకునే వారి ఇళ్లలోనే ఇలాంటి అరుదైన బ్యాక్టీరియాను తమ మైక్రోస్కోపుల ద్వారా కనుగొన్నామని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన రాబ్‌డన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News