: పరారీలో 'మెంటల్' హీరోయిన్


సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'మెంటల్' లో హీరోయిన్ గా నటిస్తోన్న సనా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై ముంబయిలో కేసు నమోదు కావడంతో సనా పత్తా లేకుండా పోయింది. దీంతో, 'మెంటల్' చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే, సనా ఖాన్ సోదరుడు ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ బాలికను పెళ్ళి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడట. అయితే, అతని కోరికను తిరస్కరించడంతో ఆ అమ్మాయిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు సనా సోదరుడు. ఎలాగో వారి నుంచి తప్పించుకున్న ఆ టీనేజ్ గాళ్.. తనను అపహరించిన వారిలో సనా కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా.. సనా ఖాన్ గతంలో తెలుగులోనూ నటించింది. కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'కత్తి'లో హీరోయిన్ గా తళుక్కుమంది సనా ఖానే. పలు రియాల్టీ షోల్లో విజేతగా నిలిచిన సనా ఖాన్ కు సల్మాన్ పిలిచి మరీ తన 'మెంటల్' చిత్రంలో అవకాశమిచ్చాడట.

  • Loading...

More Telugu News