: బాబుకు భద్రత కల్పించడంలో సర్కారు విఫలం: టీడీపీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆ పార్టీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు, పర్యటనల సమయంలో సభావేదికలను సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉందని ఆయన అన్నారు. అయినా ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఈ రోజు గుంటూరు జిల్లా పాదయాత్రలో భాగంగా కొలకలూరులో చంద్రబాబు ఉన్న సభా వేదిక కూలిపోయిన సంగతి తెలిసిందే. గతంలోనూ రెండు సార్లు ఇలానే జరిగింది.