: గురునాథ్ ను ప్రశ్నించేందుకు క్రైమ్ బ్రాంచ్ రెడీ


బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ప్రశ్నించేందుకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న గురునాథ్ ను క్రాఫోర్డ్ మార్కెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గురునాథ్ ను తాము అరెస్టు చేయబోవడంలేదని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు అంటున్నాయి. కాగా, గురునాథ్, విందూ సింగ్ లను కలిపి ప్రశ్నించాలని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో గురునాథ్ పేరును బయటపెట్టింది విందూ సింగేనన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News