: చంద్రబాబుపై కడియం సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కడియం శ్రీహరి నేడు బాబుపై నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణను అడ్డుకుంది బాబే అని ఆరోపించారు. తెలంగాణ విషయమై కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖలో ఏమీ లేదని అన్నారు. తానే చొరవ తీసుకుని తెలంగాణ అంశంపై షిండేతో చర్చించానని తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ తో కలిసి రాజీనామాల డ్రామాకు తెరదీశారని కడియం అన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం చేయించడమే కాకుండా బాబుతో స్పష్టమైన ప్రకటన చేయించాలని పేర్కొన్నారు.