: భానుడి ప్రతాపానికి 147 మంది బలి


రాష్ట్రం మండిపోతోంది. ప్రచండ భానుడి విశ్వరూపానికి ప్రజానీకం హడలిపోతోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వడదెబ్బ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ హెచ్చుతోంది. రాష్ట్రంలో 147 మంది మృత్యువాత పడ్డారంటేనే అర్థం అవుతోంది ఎండ వేడిమి ఏ స్థాయిలో ఉందో. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 22 మంది ప్రాణాలు విడిచారు.

  • Loading...

More Telugu News