: 'ఏవీఎం' అధినేత కొడుకే.. ఈ గురునాథ్


గురునాథ్ మెయ్యప్పన్.. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశం బట్టబయలైన రెండ్రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన పేరిది. ఇప్పటివరకు గురునాథ్ బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ అల్లుడిగానే ప్రాచుర్యంలో ఉన్నారు. కానీ, ఆయన తండ్రి తరుపున ఘనతర కుటుంబ నేపథ్యం ఉంది. ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ 'ఏవీఎం' అధినేత బాలసుబ్రమణియన్ తనయుడే ఈ గురునాథ్. తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించే 'ఏవీఎం' సంస్థను ఏవీ మెయ్యప్పన్ స్థాపించారు. ఈయనకు ఐదుగురు కుమారులు కాగా.. గురునాథ్ తండ్రి బాలసుబ్రమణియన్ వారిలో ఒకరు. గురునాథ్ 'ఏవీఏం' ప్రొడక్షన్స్ కు మేనేజింగ్ డైరక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News