: ప్రభుత్వోద్యోగాల భర్తీకి షెడ్యూలు రెడీ
రాష్ట్రంలో 34,450 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో మరో 3,498 భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో 12,072 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా, 7,346 ఉద్యోగాలను డిఎస్సీ ద్వారా, మరో 11,387 కానిస్టేబుల్ పోస్టులను పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా, 133 పోస్టులను యూనివర్సిటీల ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం భర్తీకి నిర్ణయించిన ఉద్యోగాల వివరాలు... గిరిజనశాఖ ఉపాధ్యాయులు 1877 ఉద్యోగాలు, ఎక్సైజ్ ఎస్సై 314 ఉద్యోగాలు, ఎక్సైజ్ సూపరిండెంట్ 24 ఉద్యోగాలు, జూనియర్ లెక్చరర్లు 4,523 ఉద్యోగాలు, డిగ్రీ లెక్చరర్లు 617, ట్రైనీ లెక్చరర్స్ 180 పోస్టులను, డిప్యుటీ కలెక్టర్స్ 10 పోస్టులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 59, పీఆర్వోలు 5 అసిస్టెంట్ పీఆర్వోలు 21 పోస్టులు భర్తీ చేయనున్నారు.