: తిరుపతి వెంకన్నకు 3 కోట్ల సాలగ్రామ హారం
శ్రీవారి సన్నిధికి మరో విలువైన ఆభరణం వచ్చి చేరింది. చంద్రునికో నూలుపోగులా శ్రీనివాసుడి ఖజానాలో ఓ ఆభరణాన్ని జమ చేసి తరించిపోయాడు ఓ భక్తుడు. తిరుమల తిరుపతి వెంకటాచలేశునికి చెన్నైకి చెందిన భక్తుడు ఒకరు 3 కోట్ల విలువైన స్వర్ణ సాలగ్రామ హారాన్ని శుక్రవారం విరాళంగా అందజేసాడు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అతన్ని ఘనంగా సత్కరించారు.